గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావం – భాస్కర్ గౌడ్
సిసి రోడ్ పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ గౌడ్
మన సాక్షి గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
కేశంపేట, నిడుదవెల్లి:గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెదురువెల్లి భాస్కర్ గౌడ్ తెలిపారు. బుధవారం నిడుదవెల్లి గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిధుల కొరత లేకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల ప్రగతిలో పక్కా రోడ్లు, మంచినీటి సదుపాయాలు, పల్లె ప్రగతి పథకాలు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అమీర్, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు అరుణమ్మ, మాజీ అధ్యక్షుడు బడక మల్లయ్య, దిద్దుల ముత్యాల, దిద్దెల జంగయ్య, ఆకుల రామకృష్ణ, మాజీ డిప్యూటీ సర్పంచ్ కాజా పాషా, సిల్వర్ చంద్రయ్య, రోయ్యల జంగేశ్, బైండ్ల నరసింహ, బోడ మల్లేష్, నసీర్, యాదయ్య, దిద్దుల ప్రవీణ్, కసాబ్ గోపాల్, బోడ కృష్ణయ్య, వెంకటయ్య, బాలకృష్ణ, అంజయ్య సహా గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గ్రామంలో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పింది.