ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్ద ప్రమాదం.. కుప్పకూలిన పైకప్పు-
ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో ఘోర చిక్కుకున్న 50మంది కూలీలు
హుటాహుటిన బయల్దేరిన మంత్రి ఉత్తమ్.
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి)నాగార్జునసాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి22
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో ప్రమాదం జరిగింది..ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది.
శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడి కుప్పకూలింది. దీంతో 10 మంది కూలీలు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 52 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ఐదేండ్ల విరామం తర్వాత ఈ నెల 18న సొరంగం తవ్వకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి.14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగింది. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది కార్మికులు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి వెళుతున్నారు నాగర్ కర్నూల్ ఎస్పీ భవ్ గైక్వాడ్. ఐదుగురు కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు చెబుతున్నారాయన. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. పైకప్పు కూలింది. అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది.
సహాయక చర్యలు ముమ్మరం చేయండి.సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ లో పైకప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల వాఖ సలహాదారు, ఇతర అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు.