అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 135 యూనిట్ల రక్తసేకరణ..
*రక్తదానానికి యువత ముందుకు రావడం అభినందనీయం…*
*జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్..*
కామారెడ్డి. ప్రజాగొంతుక. ప్రతినిధి. కరుణాకర్.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలవడం జరిగింది అని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ తెలియజేశారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది.రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చిన రక్త దాతలకు,ఈ శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన డాక్టర్ బాలు,జమీల్ హైమాద్,శివాజీ లకు తలసేమియా పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొని రక్తదాతలను అభినందించడమే కాకుండా రక్తదానం చేసిన ఎంఈఓ రామస్వామి,ఎస్సై వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిజాం,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కపిల్ రెడ్డి లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.