స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవ్వడం తద్యం…
ప్రజలలో ఆదరణ చూడలేక టిఆర్ఎస్ అసత్య ప్రచారం..
ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా..
కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగిటి విద్యనాథ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో ఆదరణ చూడలేక బిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని,ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ అన్నారు.బిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు అన్నారు.పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల రుణమాపి చేసి రైతును రాజును చేసిందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, జీరో కరంట్ బిల్లు లు, 500లకే గ్యాస్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇచ్చిందన్నారు. ఇప్పుడు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇందిరమ్మా ఇండ్లు ఇస్తున్నాం, ఇది నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రులు తెలియజేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు వచ్చే స్థానిక ఎన్నికలలో ఓడిపోతామని లేనిపోని అబద్ధపు మాటలు మాట్లాడుతూ గ్రామ సభలలో గందరగోళం చేస్తున్నారు. మీరు ఎన్ని మాట్లాడిన ఎన్ని చేసిన టిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మరని స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని తెలియజేశారు.మా నాయకుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పారు . మా నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండుకుంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు అని తెలిపారు