సీతారామాంజనేయ సేవలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
*ప్రజా గొంతుక ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)*:
మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీతా మీడోస్లో నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం పదో వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న *_మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి _* దేవాది దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి , బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి మరియు ఇతర మాజీ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు సబితా ఇంద్రారెడ్డి అభిమానులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.