సెంట్రింగ్ బాక్స్ లు తొలగిస్తుండగా గోడ సజ్జా కూలి ఒకరు మృతి..
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
సెంట్రింగ్ బాక్స్ లు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు గోడ సజ్జా కూలి ఒకరు మృతి సంఘటన బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. బచ్చన్నపేట ఎస్సై ఎస్.కె హమీద్ తెలిపిన వివరాల ప్రకారం ఆచ్చి వెంకటేశ్వర్లు వయస్సు 61 కులం: వడ్డెర, వృత్తి: మేస్త్రి గ్రామం మల్లయ్య పాలెం బల్లెకురువ మండలం బాపట్ల జిల్లా అను వ్యక్తి గత కొద్దిరోజుల క్రితం చేర్యాల లో గుంజి సుబ్బారావు అను అతని వద్ద ఉంటూ చుట్టుపక్కల మేస్త్రి గా పని చేసేవాడు. 20-04-2025 రోజున 12:30 గంటలకు నాగిరెడ్డిపల్లి లోని కొత్తగా నిర్మిస్తున్న ఇంటివద్ద తొమ్మిది రోజుల క్రితం పోసిన గోడ సజ్జా సెంట్రింగ్ బాక్స్ లు తొలగించగ ప్రమాదవశాత్తు అట్టి సజ్జా ఒక్కసారిగా సదరు వెంకటేశ్వర్లు ఎడమ బుజం పై పడి అక్కడికక్కడే మరణించినాడు. మృతుడి బంధువు తన్నీరు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బచ్చన్నపేట ఎస్ ఐ హమీద్ తెలిపినారు. మృతుడికి గతంలో భార్య చనిపోయినది. ఒక కూతురు ఉన్నది.