ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, జూన్ 13:
మెదక్ జిల్లా. శివంపేట మండల కేంద్రంలోని, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ నగర్ కాలనీ లోని 1వ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. అందరి పిల్లలకు నూతనంగా పలకలు అందించగా, హెచ్ఎం అర్చన కుమారి, హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయులు లక్ష్మణ రావు, స్వప్న కుమారి, రాజేంద్ర ప్రసాద్, అంగంవాడి టీచర్స్ కృష్ణవేణి, నవీన, చిన్నారుల తల్లితండ్రులు హాజరయ్యారు.