గోపాల్ నగర్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ
గోపాల్ నగర్ గ్రామంలో మెజార్టీతో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ యే….
గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్
మన సాక్షి గొంతుక, బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, గోపాల్ నగర్ గ్రామంలో జనగామ డి సి సి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ,మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్ ఆధ్వర్యంలో పార్టీ సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం కల్పించిన ఏ రిజర్వేషన్ వచ్చిన, గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు ఘనపురం నాగేష్ మాట్లాడుతూ గత ఎన్నికలలో గోపాల్ నగర్ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డగా నిలిచింది అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అడ్డగా గోపాల్ నగర్ నిలుస్తుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు నేరుగా అందజేసి ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా రూపకల్పన చేసిందని, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా కోడవటూర్ డైరెక్టర్ గా నియమితమైన వల్లాల సత్యనారాయణ ను, గ్రామ సోషల్ మీడియా కన్వీనర్ చింతల కరుణాకర్ ల ను కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వద్ది ఎల్లయ్య, యూత్ అధ్యక్షుడు నీల నవీన్ ,గంగరబోయిన ఐలయ్య అనిల్ రెడ్డి, పిట్టల రాములు, కళ్యాణ్ రామ్, సిరుపాటి సాయి,