పది ఏండ్లలో మీరు ఇచ్చిన ఇండ్లు ఎక్కడ బిఆర్ఎస్ నాయకుల్లారా..
ప్రజల్లారా బిఆర్ఎస్ నాయకుల కపట మాటలు నమ్మవద్దు
కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షుడు మట్టి బాలరాజు..
ప్రజా గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఇండ్లు ఎక్కడ ఉన్నాయో చూపెట్టండి టిఆర్ఎస్ నాయకుల్లారా మీ కపట మాటలను ప్రజలు నమ్మరు అనిఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంఅని,బిఆర్ఎస్ పార్టీకి ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి సంబంధం లేదు అని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షుడు మట్టి బాలరాజు అన్నారు.పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి కృషితో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లను ఏం. యల్. ఏ ఇచ్చిండని చెప్పుకోవడం విడ్డూరమని గడిచిన పది సంవత్సరాలలో ఒక్కడబల్ బెడ్ రూమ్ ఇప్పించలేదని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లను మేమే ఇచ్చినామని చెప్పుకుంటూ కేసిఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం విడ్డూరం అన్నారు. నిజంగా బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేయాల్సి వస్తే పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని హితవు పలికారు.