Tuesday, July 8, 2025

వెనిగండ్ల సొసైటీ కి రెగ్యులర్ సీఈఓని నియమించాలి——సిపిఎం

(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి) నాగార్జున సాగర్ నియోజక వర్గం: ఫిబ్రవరి:14

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలంలోని వెనిగండ్ల సహకార సంఘం సొసైటీకి 1సంవత్సర, 6 నెలల నుండి రెగ్యులర్ సీఈఓ లేకపోవడం వల్ల సొసైటీ అక్రమాలకు అవకతవకలకు నిలయంగా మారిందని,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ లు శుక్రవారం నిడమనూరులో వారు ఒక ప్రకటనలో ఆరోపించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సొసైటీలో సీఈఓ గా పనిచేసిన వ్యక్తులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వారిని తొలగించి వారి స్థానంలో రెగ్యులర్ సీఈఓ ను నేటికీ నియమించలేదని వారన్నారు, సీఈఓ నియమించాలని పాలకవర్గం మూడుసార్లు సమావేశం నిర్వహించిన నేటికి నియమించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు, సొసైటీలో అక్రమాలు అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులను కొనసాగిస్తున్నారని, సొసైటీ ఉద్యోగులు ఇష్ట రాజ్యాంగ ఎవరికి వారే సీఈఓ లుగా వ్యవహరిస్తున్నారని, పాలకవర్గం పట్టించుకోవడంలేదని వారన్నారు, గతంలో అక్రమ ఖాతాలు తెరిచి రైతుల పేర్లతో డబ్బులు కాజేశారని వారన్నారు. రుణమాఫీలో రుణాలు మంజూరులో రైతుల నుండి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశారని, అనేక అవినీతి ఆరోపణ ఉన్నప్పటికీ పట్టించుకునే వారే లేరని వారన్నారు, నాలుగో విడత రుణమాఫీ లిస్టు వచ్చి నెల రోజులు అవుతున్న రెగ్యులర్ సీఈఓ లేకపోవడంతో రైతులు సొసైటీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని, వడ్డీలు కట్టించుకుని తిరిగి రైతులకు రుణాలు రెగ్యులర్ చేయలేదని దీంతో పెట్టుబడుల సమయంలో రైతులు అప్పులు దొరకక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు, రుణమాఫీ అయిన రైతులకు పాస్ బుక్కులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు బోనస్ డబ్బులు జమ చేయలేదని వారు అన్నారు, రెగ్యులర్ సీఈఓ ని నియమించి అవినీతి అక్రమాలపై ఉన్నంత అధికారులు విచారణ చేపట్టి రుణమాఫీ అయిన రైతులకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో *సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంచం శేఖర్* తదితరులు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular

Home
Videos
Search
Whatsapp