నేడే జిల్లా కేంద్రంలో బిజెపి కార్యకర్తల ముఖ్య సమావేశం.
శివంపేట. ప్రజా గొంతుక న్యూస్,జూన్ 11:
మెదక్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో గురువారం రోజున ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. 11 ఏళ్ల మోడీ ప్రభుత్వం సంకల్పంతో పాటు వివిధ పార్టీ కార్యక్రమాలపై చేర్చించనున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు పై కృషి చేయాలని కార్యకర్తలకు,నాయకులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ హాజరుకానున్నారు. కావున జిల్లాలోని భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యల హాజరై విజయవంతం చేయగలరు.