2024-25 విద్యా సంవత్సరంలో వివిధ రాష్ట్ర స్థాయి క్రీడలలో రాణించిన అక్షయ స్కూల్ విద్యార్థులు
(ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి )షేక్ షాకీర్: నల్గొండ జిల్లా: మార్చి: 07
1) 2024 ఆగష్టులో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ సబ్ జూనియర్ నెట్
బాల్, ఫాస్ట్ ఫైవ్ క్రీడలలో నల్గొండ జిల్లా జట్టుకు మన అక్షయ పాఠశాల విద్యార్థి కే.చంద్ర శేఖర్
పాల్గొని, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జిల్లా జట్టుకు ద్వితీయ బహుమతి పొందడంలో కీలకపాత్ర
పోషించాడు.
2) 23-25, 2024 నవంబర్ లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిర్వహించిన 68వ
తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ లో అండర్ -17 నెట్ బాల్ విభాగంలో మన అక్షయ
పాఠశాల విద్యార్థులైన షేక్.సనావుల్లా, కే.చంద్ర శేఖర్ లు మంచి ప్రదర్శన చేసి జిల్లా జట్టుకు
తృతీయ బహుమతి సాధించారు. వీరు ఇరువురినీ మన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
అభినందించడం జరిగింది.
3) 9-11, 2024 డిసెంబర్ లో కరీంనగర్ లో జరిగిన 68వ తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్
అండర్-14 బాలుర విభాగంలో మన జిల్లా తృతీయ బహుమతి పొందడంలో మన పాఠశాల
విద్యార్థులైన ఆర్.జగన్, వి.అశోక్ లు మంచి ప్రదర్శన చేశారు.
4) భజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ స్థాయి చెస్ పోటీలలో ద్వితీయ
బహుమతి సాధించిన మన విద్యార్థిని క్యాథరిన్ సెబాస్టియన్
5) 68 స్కూల్ గేమ్స్ విభాగంలో అండర్ -14 బాలికల విభాగంలో నల్గొండ జిల్లా జట్టు నుండి రాష్ట్ర
స్థాయి క్రీడలలో ఆర్.గీత, షేక్.షఫియా లు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.
6) ఎస్ఎఫ్ఐవారు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలలో మన అక్షయ పాఠశాల తృతీయ
బహుమతి సాధించడం జరిగింది.
7) 20-23, 2025 జనవరిలో వికారాబాద్ లో తెలంగాణ రాష్ట్ర 34వ సబ్ జూనియర్ కబడ్డీ
పోటీలలో మన నల్లగొండ జిల్లా జట్టు చాంపియన్ గా మొదటి బహుమతి పొందడంలో మిఖ్య
పాత్ర పోషించిన మన పాఠశాల విద్యార్థి కే.శివమణి
8) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ మహిళ విభాగం మన జిల్లా ప్రథమ
బహుమతి సాధించడం జరిగింది. మన జిల్లా ప్రథమ బహుమతి సాధించడం జరిగింది. మన జిల్లా
జట్టుకు ఆర్.గీత మన పాఠశాల నుండి పాల్గొనడం జరిగింది.
9) స్కూల్ గేమ్స్ లో ఖో-ఖో విభాగం లో ఎన్.మణికంఠ, ఆర్.అనిల్ లు, వాలీబాల్ లో నాగరాజు,
కబడ్డీలో ఎస్.గణేశ్ లు పాల్గొన్నారని తెలియజేస్తున్నాము.
10) అండర్-9 రన్నింగ్ విభాగంలో జిల్లా ద్వితీయ బహుమతి సాధించిన మన 3వ తరగతి
విద్యార్థిని ఎస్.వెరోనిక
పాల్గొన్నారు