ప్రపంచ ప్రేమికులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
*వ్యక్తుల స్వేచ్ఛను పరిరక్షించాలి – బిఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్*
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో (ఆర్.ఆర్.గౌడ్)
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత దొడ్డి శ్రీనివాస్ ప్రేమికులకు మద్దతుగా స్పష్టమైన సందేశం ఇచ్చారు.
*ప్రేమ అనేది పరిమితి లేనిభావన*
దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రేమ అనేది కేవలం ప్రేమికుల మధ్య పరిమితం కాకుండా తల్లిదండ్రుల ప్రేమ, అన్నా-చెల్లెళ్ల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ ఇలా అనేక రూపాల్లో ఉంటుందని తెలిపారు. ప్రేమ అనే గొప్ప భావన సమాజంలో నేరాలను తగ్గించగలదని అభిప్రాయపడ్డారు.
*వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలి*
ప్రేమికులు స్వేచ్ఛగా పార్కులు, దేవాలయాలకు వెళ్లడం వారి ప్రైవసీలో భాగం అని అన్నారు. ఇది వారి వ్యక్తిగత హక్కు, దీన్ని అడ్డుకోవడం నేరం అని స్పష్టం చేశారు.
*బలవంతపు పెళ్లిళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి*
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, బలవంతంగా పెళ్లిళ్లు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వారిని జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
*ప్రేమ సమాజాన్ని, దేశాలను అభివృద్ధి చేస్తుంది*
ప్రధాని నరేంద్ర మోడీ – అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం, దేశాలకు ఎలా మేలు చేసిందో ఉదాహరణగా చూపారు. ప్రేమ పూర్వక సమాజం ఏర్పడితే అందరికీ సమాన హక్కులు, శాంతి, అభివృద్ధి సాధ్యమవుతాయని ఆయన తెలిపారు.
*ప్రేమికులకు భరోసా*
ఈ సందర్బంగా ప్రేమికులకు భరోసా ఇస్తూ, వారి స్వేచ్ఛను కాపాడేందుకు బిఎస్పీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
*ప్రేమకు మద్దతుగా నిలద్దాం – ప్రేమను గౌరవిద్దాం!*