దంతంపల్లిలో వెంకటరామిరెడ్డి ఆర్థిక సహాయం.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 12 :
మెదక్ జిల్లా.శివంపేట మండలం,దంతాన్ పల్లి గ్రామానికి చెందిన కుల్ల భూపతి అనారోగ్యంతో నిన్న మరణించడం జరిగింది. గ్రామస్తుల ద్వారా మన ప్రియతమ నాయకుడు ఆపద్బాంధవుడు శివంపేట మండల పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి కి గ్రామస్తులు చెప్పడం జరిగింది వారి కుటుంబానికి వారి తమ్ముడు చింతల లక్ష్మారెడ్డి అన్నగారి చేతుల మీదుగా వారి కుటుంబానికి తన సొంత డబ్బులు అక్షరాల 5,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజేంధ్రుల నర్సింలు,గొల్ల నాగేందర్,గొల్ల యాదగిరి,గొల్ల గణేష,నాంచారి ప్రకాష్,కుల్ల సిద్దులు,శివ,సురేష గ్రామస్తులు గెడ్డి నాగరాజు.తదితరులు పాల్గొనడం జరిగింది.