ఓదెలలో ప్రమాదవషాత్తు ఇల్లు దగ్ధం…
ప్రజా గొంతుక ఓదెల ప్రతినిధి: ఇరుకుల్ల వీరేశం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం రాత్రి ఓ ఇంటిలో ప్రమాదవ షత్తు ఇల్లు దగ్ధం వివరాల్లోకి వెళితే ఓదెల మండల కేంద్రంలోనాగవెళ్ళి నరసయ్య ఇంటిలో దేవుని దగ్గర దీపం ముట్టించిన ఇంటిలో ప్రమదావషత్తు మంటలు చెలరేగి బియ్యం బట్టలు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయినాయి,ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పినారు. ప్రతిరోజు కూలి పని చేసుకునే నరసయ్య కుటుంబం సామాగ్రి కాలడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు. మూడు నెలల క్రితమే ఇంటిలో వివాహం జరగినది. తక్షణ సాయం కింద ఓదెల మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్నస్వామి 2000 రూపాయలు సహాయం అందించినారు. ప్రతి సంవత్సరం వేసకాలంలో ప్రమాదాలు జరుగుతుంటాయి అందుకు ప్రతి మండలానికి ఒక ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.