మహిళా జాబ్ మేళాలో మహిళలందరూ పాల్గొనండి!
*సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, టాస్ట్ సిఒఒ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్*
*ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో*
*మహిళలకు అద్భుత అవకాశము!*
ప్రజా గొంతుక /రంగారెడ్డి జిల్లా బ్యూరో
ఒక మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా?
ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో మహిళల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించబడుతోంది.ముఖ్యమైన అర్హతలు.పదవ తరగతి (పాస్/ఫెయిల్), ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటిఐ, నర్సింగ్ తదితర కోర్సులు చదివిన 18-30 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలు పాల్గొనవచ్చు.ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొంటారు. ఉద్యోగం పొందినవారికి ఉచిత బస్సు సౌకర్యం – రోజూ కల్వకుర్తి నుంచి కంపెనీకి బస్సు ఏర్పాటు.
రెండు పూటల భోజనం కంపెనీ అందిస్తుంది. ఈ.ఎస్ .ఐ , పిఫ్ సౌకర్యాలు కంపెనీ ద్వారా లభిస్తాయి.ఎందుకు పాల్గొనాలి?మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జాబ్ మేళా – స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు అద్భుత అవకాశం.సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా ఎన్నో సేవలుఅందిస్తున్నారు.మహిళలు తమ స్వంత గుర్తింపు పొందాలి, ఆత్మవిశ్వాసంతో జీవించాలి అనే లక్ష్యంతో ఈ మేళా ఏర్పాటు. కల్వకుర్తి పట్టణం మరియు పరిసర ప్రాంతాల మహిళలు, యువతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగం పొందండి!