ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా
కుడికిళ్ళ గ్రామానికి చెందిన బచ్చలకూర లక్ష్మణ్ మాదిగ ఎంపిక
ప్రజా గొంతుక న్యూస్/ చిన్నంబావి మండలం/ సెప్టెంబర్
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత పెద్దలు మంద కృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు, నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జిలు ఆడెపు నాగార్జున మాదిగ మరియు మద్దిలేటి మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా,, గోవిందు నరేష్ మాదిగ, ఎం ఎస్పి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకట్ స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గుట్ట విజయ్ మాదిగ సమక్షంలో నాగర్ కర్నూల్ ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీలో కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామానికి చెందిన బచ్చలకూర లక్ష్మణ్ మాదిగ గారిని నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. బచ్చలకూర లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ నాపై విశ్వాసం ఉంచి నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినందుకు అదేవిధంగా నన్ను విశ్వసించి నాపై నమ్మకం ఉంచి ఈ ఉద్యమ ప్రయాణంలో నన్ను ముందరికి నడిపిస్తున్నటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నకు, మరియు ఆయన అడుగుజాడల్లో అడుగై జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పాలమూరు ముద్దుబిడ్డ డైనమిక్ లీడర్ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాదిగ అన్న గారికి హృదయపూర్వక సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను.